ఇదెక్కడి న్యాయం: హర్యానా ముఖ్యమంత్రి

SMTV Desk 2017-08-06 13:01:03  Haryana chief minister about Vikas barala arrest, Haryana BJP President Subhash barala, Haryana Minister Subhash barala son vikas arrest

హర్యానా, ఆగష్ట్ 6: నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన భాద్యతగల కేబినెట్ మంత్రి కుమారుడే పెడదారి పడితే సాధారణ ప్రజానీకం ఏమవుతుంది. ఇలాంటి సంఘటనే ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చండీగఢ్‌లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి సుభాష్ బరాలా కుమారుడు వికాస్ ఓ మహిళలను వేధించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే ఇటీవల ఈ నేరంపై వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా హర్యానా విపక్షాలు దీనిపై ఆందోళన బాట పట్టాయి. ఇందులో భాగంగా సుభాష్ బరాలాను బర్తరఫ్ చేయాలని గగ్గోలు పెట్టాయి. విపక్షాల ఆందోళనలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ స్పందిస్తూ కుమారుడి తప్పుకు తండ్రిని శిక్షించలేమన్నారు. వికాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందని తెలిపారు.