డేటా చోరీ క్రిమినల్ నేరం

SMTV Desk 2019-03-07 15:40:45  CPI, Narayana, Election Commission, Crime, IT Grid, Data Leak

అమరావతి, మార్చి 7: ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దూమారం రేపిన ఐటీ గ్రిడ్ డేటా చోరి పై సీపీఐ నాయకుడు నారాయణ స్పందించారు. డేటా చోరీ క్రిమినల్ నేరమని, ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన డేటా వేరే వారి వద్ద ఉండకూడదని అన్నారు. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన డేటా ఓ ప్రైవేట్ సంస్థ వద్ద ఉండటం దారుణమని, దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కూడా సరిగ్గా పని చేయటం లేదని ఆరోపించారు. ఈ డేటా చోరి కేసును సుప్రీమ్ కోర్ట్ లో విచారణకు పంపాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోటీ చేస్తామని ఈ మేరకు స్పష్టం చేశారు.