జగన్ సీఎం కావాలని చాలా కళలు కంటున్నారు : దేవినేని

SMTV Desk 2019-03-07 15:39:38  AP Minister, Devineni uma maheshwararao, YSRCP, YS Jagan mohan reddy, Narendra modi

విజయవాడ, మార్చ్ 07: ఏపీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం కావాలని చాలా కళలు కంటున్నారని అందుకే టీడీపీ సానుభూతి ఓటర్లను తొలగించడాని దేవినేని అన్నారు. జగన్ పై తెలంగాణలో 24 లక్షల మంది ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేస్తే క్షమించాలని చెప్పి తెలంగాణ అధికారులు వదిలేశారని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇటువంటి తప్పుడు కేసులు నమోదు చేస్తుంది అని ప్రశ్నించారు. అంతకుముందు ఓట్ల తొలగింపు వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఈరోజు ఫిర్యాదు చేశారు టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర టిడిపి నేతలతో కలిసి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో మరోసారి చంద్రబాబుకు ప్రజలు పట్టం కడతారని తెలిసే మోడి ,జగన్‌ కెసిఆర్‌ కుట్రలు పన్నుతున్నారని మంత్రి దేవినేని ఆరోపించారు.