సాహో మేకింగ్ వీడియో సరికొత్త రికార్డు

SMTV Desk 2019-03-07 14:00:44  saaho,

హైదరాబాద్, మార్చ్ 07: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రంగా .. సుజిత్ దర్శకత్వంలో సాహో రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవల శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకి వస్తోన్న హైప్ అంతా ఇంతా కాదు.