బాలకృష్ణకి ఎదురుదెబ్బ!

SMTV Desk 2019-03-07 13:38:49  Balakrishna, Hindupuram, MLA, Tour TDP,

అమరావతి, మార్చి 7: ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారని తెలిసిందే. అయితే ఈరోజు బాలకృష్ణ తన నియోజకవర్గంలో ప్రవేశించగానే ఎదురుబెబ్బ తగిలింది. చిలమత్తూరులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఆయన, లేపాక్షి నంది సర్కిల్‌ వద్దకు రాగానే తన వాహనాన్ని అక్కడి ప్రజలు, మహిళలు అడ్డుకొని నిరసన తెలిపారు. ఆయన లేపాక్షి నంది సర్కిల్‌ వద్దకు రాగానే జనం ఆయన కారును అడ్డుకొని, కారు దిగగానే జనాలు చుట్టుముట్టారు.


హంద్రీనీవా ద్వారా లేపాక్షి మండలంలోని అన్ని చెరువులకు నీళ్లిస్తామని చెప్పి, చిన్న చెరువులను విస్మరించారని మండిడ్డారు. మహిళలైతే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాగేందుకు నీళ్లులేక అల్లాడిపోతున్నామని, పశువులకు నీళ్లు కూడా లేవని మండిపడ్డారు. మీకు చెప్పుకుందామంటే మీరెక్కడుంటారో తెలియకుండా పోయిందన్నారు. ఇక పరిస్థితి చేజారుతోందని గ్రహించిన టీడీపీ నాయకులు మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు చలపతి, మాజీ ఎంపీపీ ఆనంద్‌ మరికొందరు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ హడావుడి సృష్టించారు. అయినప్పటికీ మహిళలు నీటికోసం గట్టిగా నిలదీశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని వినతి పత్రం అందజేశారు