వైఎస్ జగన్ గారూ క్రైమ్ కి కేరాఫ్ అడ్రస్ : లోకేష్

SMTV Desk 2019-03-07 12:13:38  ap cm, chandrababu, ysrcp, ys jagan mohan reddy, data scam, nara lokesh, tdp

అమరావతి, మార్చ్ 06: ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ గారూ క్రైమ్ కి కేరాఫ్ అడ్రస్ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. సైబ‌రాబాద్ నిర్మించ‌డం సీఎం చంద్ర‌బాబుగారికి తెలుసన్న లోకేష్ సైబ‌ర్ క్రైమ్ చేయ‌డం మీకు మాత్ర‌మే తెలుసంటూ జగన్ పై ధ్వజమెత్తారు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష ప‌త్రాలు ఎత్తుకెళ్లిందీ నువ్వేనంటూ తిట్టిపోశారు. ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నం లూటీ చేసిందీ నువ్వే అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ డేటా చోరీ చేసిందీ నువ్వే అంటూ మండిపడ్డారు. నేరాల్లోనూ, ఘోరాల్లోనూ, చోరీల్లోనూ నీకు నీవే సాటి నీ ర్యాంకు A1 అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ పై ధ్వజమెత్తారు.