వారి మృతదేహాలు చూస్తేనే తమ కుటుంబాల ఆత్మకు శాంతి!

SMTV Desk 2019-03-07 12:08:38  pulwama attack, pakistan terrorists attack, indian airforce, crpf army, central government, pakistan government

న్యూఢిల్లీ, మార్చ్ 06: పుల్వామా దాడిలో మృతి చెందిన అమర జవాన్ల కుటుంబాలు ఇప్పుడు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. జవాన్లపై దాడి చేసిన వారిపై ప్రతీకగా ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో సుమారరు 250 మంది ఉగ్రవాదులు మృతి చెందారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. కాని పాకిస్తాన్ మాత్రం ఈ దాడి వల్ల మాకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. ఇక భారత వైమానిక దళం శవాలను లెక్కించడం మా పని కాదంటూ తేల్చి చెప్పింది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని పూల్వామా ఉగ్ర దాడిలో వీర మరణం పొందిన యూపీ రాష్ట్రానికి చెందిన ప్రదీప్‌కుమార్, రామ్ వకీలు కుటుంబం నుంచి రామ్ వకీల్ సోదరి రామ్ రక్షా మీడియాతో మాట్లాడారు. పూల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్న విషయాన్ని చూసినట్టు చెప్పారు. ఇందుకు బాధ్యత వహించిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకొందనే భావిస్తున్నామని ఆమె చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ దేశంలో ఎలాంటి నష్టం కలగలేదనే పాక్ ప్రకటించిన విషయాన్ని ఆమె గర్తు చేశారు. అయితే ఉగ్రవాదుల శిబిరాలపై ఇండియా జరిపిన దాడిలో మరణించిన ఉగ్రవాదుల మృత దేహాలను చూపితే తమ కుటుంబాల ఆత్మకు శాంతి కలుగుతోందన్నారు.