ఏపీ ప్రజల ఓట్ల గల్లంతు కేసులో టీఎస్ సర్కార్ సంచలన నిర్ణయం

SMTV Desk 2019-03-07 12:07:41  telangana government, ap voters list scam, ig Stephen ravindra

హైదరాబాద్, మార్చ్ 06: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఓట్ల చోరీ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ గ్రిడ్ కేసును సమగ్రంగా విచారించేందుకు గాను ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని టీఎస్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐటీ గ్రిడ్‌పై సైబరాబాద్, హైద్రాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసులను దర్యాప్తు చేసేందుకుగాను సిట్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్‌ సంస్థపై ఇప్పటికే రెండు కమిషనరేట్లపై కేసులు నమోదయ్యాయి. రెండు కమిషనరేట్ల పరిధిలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకే కేసు కావడంతో కేసును ఒకే అధికారి పర్యవేక్షణ కింద చేయాలని భావించి సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. ఐటీ స్టీఫెన్ రవీంద్ర సిట్‌కు నాయకత్వం వహిస్తాడు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ముగ్గురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు సభ్యులుగా ఉంటారు.