ఇప్పుడు రఫేల్‌ ఫైళ్లు మాయమయ్యాయి.. రాహుల్ గాంధీ

SMTV Desk 2019-03-07 11:58:05  Rahul Gandhi, Narendra Modi, Rafale Deal, Documents, Comments, Congress, BJP

న్యూఢిల్లీ, మార్చి 7: మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పై వ్యంగ్యస్రాలు సారించారు. రఫేల్ డీల్ పై మోదీని విచారించాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంలో మోదీ బైపాస్‌ సర్జరీ చేశారని, అనిల్‌ అంబానీకి లాభం చేకూర్చేలా జాప్యం చేశారని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు తరువాత లక్షలాది ఉద్యోగాలు గల్లంతైన విధంగా రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని ఎద్దేవా చేశారు. రఫేల్ డీల్ కు సంబందించిన ముఖ్యమైన పత్రాలు దొంగతనం అయ్యాయని సర్వోన్నత న్యాయస్థానంలో పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ ఇలా కామెంట్స్ చేశారు. "ఈ రోజుల్లో అన్నీ అదృశ్యమవుతున్నాయి..రెండు కోట్ల మంది ఉద్యోగాలు కనుమరుగయ్యాయి..ప్రజలందరి ఖాతాల్లో రూ 15 లక్షలు జమచేస్తానన్న హామీ మాయామైంది...వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కనుమరుగైంది..ఇప్పుడు రఫేల్‌ ఫైళ్లు మాయమయ్యాయి" అంటూ వ్యాఖ్యానించారు.