ధోని వీడియో వైరల్

SMTV Desk 2019-03-07 11:47:17  MS Dhoni, Fan

మహేంద్ర సింగ్ ధోనీ కోసం మరో అభిమాని సెక్యూరిటీని దాటి మైదానంలోకి దూసుకొచ్చి అతనికి పాదాభివందనం చేశాడు. ఈ సమయంలో మహీ తనదైన శైలిలో స్పందించి నవ్వులు పూయించాడు మైదానంలో . రెండో ఇన్నింగ్స్‌ లో ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ కోసం ఇండియా ఆటగాళ్లు వస్తుండగా..‘ తలా 7’ అని రాసున్న జెర్సీ వేసుకున్న ఆ వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. తొలుత అంబటి రాయుడుకు షేక్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌ ఇచ్చిన అతను.. రోహిత్‌ వెనకాల ఉన్న ధోనీని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ, అతను దగ్గరకు రాగానే మహీ పరుగు అందుకున్నాడు. అతనికి దొరకకుండా కొద్దిసేపు పరుగెడుతూ ఆట పట్టించాడు. ఈ సమయంలో మహీతో పాటు సహచరులంతా నవ్వుతూ కనిపించారు. చివరకు వికెట్ల వద్ద మహీనే ఆగాడు. దాంతో, ఈ అభిమాని మహీ పాదాలను తాకి.. అతడిని హగ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు.కాగా ఇపుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ..