బోయపాటి, బాలకృష్ణ సినిమా ఈ నెలలోనే లాంచింగ్...!

SMTV Desk 2019-03-07 11:45:08  Balakrishna, Boyapati Srinivas, Third Movie, Simha, Lezend, Vinaya Videya Rama, NTR Biopic, Movie Launching

హైదరాబాద్, మార్చి 7: ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మూడవ చిత్రం తెరకేక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ , లెజెండ్ భారీ విజయాలను సాదించాయి. ఇక తదుపరి చిత్రం కోరారు ఏర్పాట్లు చేయడంలో బోయపాటి బిజీగా వున్నాడు. ఇటివలే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ అనుకున్న స్టాయిలో విజయాన్ని సాదించలేకపోయింది. మరో వైపు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ అంత హిట్ కాకపోవడంతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

ఈ రెండు కారణాల వల్ల వీరిద్దరి కలయికలో మూడవ చిత్రం సినిమా వస్తుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతుంది. ఈ అనుమానానికి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో బోయపాటి, బాలకృష్ణ ఈ సినిమాను ముందుగ లాంచ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, ఎన్నికల తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ సినిమాకి బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తారా లేక ఇంకెవరైనా నిర్మిస్తార అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.