దేశం వదిలి వెళ్ళను

SMTV Desk 2019-03-07 11:23:21  Robert Vadra, Priyanka Gandhi, Rahul Gandhi, Money Laundering Case, Political Entry, Promised

న్యూఢిల్లీ, మార్చి 7: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావా, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా గత కొద్ది కాలంగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే కేసు పట్ల రాబర్ట్ వాద్రా శపథం చేశారు. తన పై ఉన్న ఈ ఆరోపణలన్నీ తప్పని రుజువు చేసే వరకు తాను దేశం దాటి వెళ్లనని ప్రతిజ్ఞ చేశారు.నిజం బయట పడ్డకే తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని స్పష్టం చేశారు. "నేను ఈ దేశంలో ఉన్నా. చాలా మంది ఈ దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయారు. వారి సంగతి ఏంటి? నేను ఎప్పటికీ ఈ దేశంలోనే ఉంటా. నా మీద కేసు క్లియర్ అయ్యే వరకు నేను దేశం విడిచి వెళ్లను. అలాగే, క్రియాశీలక రాజకీయాల్లోకి కూడా రాను. ఆ మేరకు నేను హామీ ఇస్తున్నా." అని తెలిపారు.