ఎన్నికల్లో అడుగు పెట్టనున్న బాలకృష్ణ చిన్నల్లుడు!

SMTV Desk 2019-03-07 11:19:03  Sribharath, Balakrishna, Lokesh, MVVS Murthi, TDP, Political Entry

అమరావతి, మార్చి 7: ఎన్నికలు సమీపిస్తున తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల కేటాయింపు వేడి పుట్టిస్తుంది. రోజురోజుకి పోటి చేస్తామన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో టికెట్ ఎవరికీ దక్కుతుందో అన్న టెన్షన్ వస్తుంది నాయకులకి. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) మంచి పట్టు ఉండడంతో అభ్యర్థులను ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎక్కువమందికి తిరిగి టికెట్లు లభించే సూచనలు లేవని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమలో నేడు రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అత్యంత ముఖ్యమైన లోక్‌సభ స్థానం విశాఖ నుండి దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేశ్‌కు తోడల్లుడు అయిన శ్రీభరత్ పోటీ చేసే అవకాశం ఉందన్న వార్త వినిపిస్తున్నాయి. ఎంవీవీఎస్ మూర్తి టీడీపీకి ఎంతో సేవ చేశారని, దానిని దృష్టిలో పెట్టుకొని శ్రీభరత్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకుల్లో కొందరు అధిష్ఠానాన్ని పట్టుబడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరంలోనే ఉన్న శ్రీభరత్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయననే బరిలోకి దించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.