వైసీపీలోకి ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ చేసుకున్న చల్లా రామకృష్ణా రెడ్డి

SMTV Desk 2019-03-06 18:56:48  challa ramakrishna reddy, tdp, ysrcp, chandrababu, ys jagan mohan reddy, andhrapradesh assembly elections

అమరావతి, మార్చ్ 06: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీ నేతల జంపింగ్ లు ఎక్కువ అయ్యాయి. ఇదివరకే అధికార పార్టీ టీడీపీ నుండి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే తాజాగా టీడీపీ నుండి మరో కీలక నేత పార్టీని వేదేందుకు సిద్దమయ్యాడు. మాజీ శానసభ్యుడు చల్లా రామకృష్ణా రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొని బుధవారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఫాక్స్‌ ద్వారా లేఖ పంపారు. చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు.దీంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.