ఢిల్లీ హైకోర్టులో 13ఎగుమతి సంస్థలపై పతంజలి కేసులు

SMTV Desk 2019-03-06 17:59:30  patanjali ayurvedik products, exports and imports companys, new delhi high court

న్యూఢిల్లీ, మార్చ్ 06: ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో బాబారామ్‌దేవ్‌ పతంజలి ఆయుర్వేద్ కంపెనీ 13ఎగుమతి సంస్థలపై కేసులు దాఖలు చేసింది. పతంజలి ఆయుర్వేదిక్ ఉత్పత్తులను ఈ 13 ఎగుమతి సంస్థలు అక్రమంగా రీప్యాక్ చేసి ఎగుమతి చేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. ఈ చర్యలకు సుమారు 13 మంది పాల్పడుతున్నారని వెల్లడించింది. ఈ పతంజలి ఉత్పత్తులను కేవలం భారత్‌లో మాత్రమె విక్రయిస్తారని, కాని ఈ సంస్థలు మాత్రం వాటిని రీప్యాక్‌చేసి మధ్యతూర్పు, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతిచేస్తున్నాయని వెల్లడించింది. సంబంధిత విదేశీ మార్కెట్లకు సంబంధించిన ఎఫ్‌డిఎనుంచి క్లియరెన్సులు తీసుకున్న తర్వాతఎగుమతి సంస్థలు ఈ ఉత్పత్తులను ఎగుమతిచేస్తున్నట్లు తేలింది. అయితే ఈ విధానం కేవలం అక్రమమమే కాకుండా అనైతికమని వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు పతంజలి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఏదేని కంపెనీ చిన్న ఫార్మసీని 1997లో ప్రారంభిస్తే పతంజలి మాత్రం రెండుడజన్లకుపైగా ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులను మార్కెట్‌కు విడుదలచేసింది. టూత్‌పేస్ట్‌, షాంపూలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఆధునిక ఆహార అలవాట్లకు తగిన స్నాక్స్‌ ఉత్పత్తులు ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌ వంటివాటిని ఉత్పత్తిచేసి దేశీయంగానే విక్రయిస్తోంది. వార్షిక విక్రయాలు ప్రతి ఏటా రెట్టింపు అవుతున్నట్లు సమాచారం. 2013నుంచి చూస్తే పతంజలి టర్నోవర్‌ 10,500 కోట్లకకుపైబడినట్లు సమాచారం.