సామాజిక న్యాయమే తెలుగుదేశ సిద్ధాంతం

SMTV Desk 2019-03-06 15:31:43  ap cm, chandrababu, tdp party leaders, teleconference

అమరావతి, మార్చ్ 06: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ’25 వేల మంది సేవామిత్రులతో త్వరలోనే భేటీ అవుతానని, వారిని మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని అన్నారు. ప్రతీ కులం వారితో అన్నదమ్ముల సంబంధం కలిగి ఉండాలని, సామాజిక న్యాయమే తెలుగుదేశ సిద్ధాంతం అని ఆయన తెలిపారు. కులాలతో రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు. ఇక్కడ కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందనీ.. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది.. అని ఆయన హామీ ఇచ్చారు. పార్టీనీ గెలిపించే బాధ్యత బూత్‌ కన్వీనర్ల చేతిలో ఉందని చంద్రబాబు తెలిపారు.