వారికి క్షమాపణలు చెప్పిన టెన్నిస్‌ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా

SMTV Desk 2019-03-06 14:07:15  tennis player Martina Navratilova, czech republic, transgenders, lesbians, bisexual, gays

చెక్‌ రిపబ్లిక్, మార్చ్ 06: చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చివరికి క్షమాపణలు కోరింది.

మార్టినా ఈ మధ్య ట్రాన్స్‌జెండర్స్‌గా మారిన అథ్లెట్లు మహిళల స్పోర్ట్స్‌లో పోటీ పడాలనుకోవడం మోసపూరితం అని ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లెస్బియన్స్‌, గేస్‌, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్స్‌ మండిపడ్డారు.

అంతేకాదు మార్టినాను అథ్లెట్‌ అల్లీ గ్రూప్‌ అంబాసిడర్‌ హోదా నుంచి తప్పించారు. దీంతో ట్రాన్‌జెండర్స్‌ పట్ల మోసపూరితం అన్న పదం వాడటం తప్పే.

నా వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా అని 62ఏళ్ల నవ్రతిలోవా తన బ్లాగ్‌లో వెల్లడించింది. అథ్లెట్‌ అల్లీ గ్రూప్‌ అనేది క్రీడల్లో ఎల్‌జిబిటి (లెస్బియన్‌, గేస్‌, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌)హక్కుల తరుపున ప్రచారం చేస్తుంది. నవ్రతిలోవా కూడా లెస్బియన్‌ కావడం గమనార్హం.