సీఎం కేసీఆర్ కు కరీంనగర్‌ సెంటిమెంట్‌ : ఈటెల

SMTV Desk 2019-03-05 18:23:36  trs, ktr, kcr, etela rajender, health minister

హైదరాబాద్‌, మార్చ్ 05: టీఆర్ఎస్ పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం రేపు కరీంనగర్‌లో జరగనుండగా...ఆ సభకు సబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ సభకు ముఖ్య అతిథిగా వస్తున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రానున్నారు. అయితే కేటీఆర్ పదవి స్వీకరించిన తరువాత కరీంనగర్ కు మొదటిసారి వస్తున్న సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలకాలని జిల్లా పార్టీనేత‌లు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ కు మొదట్నుంచి కరీంనగర్‌ సెంటిమెంట్‌ అందుకే పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక తొలి సభ కరీంనగర్‌లో నిర్వహిస్తున్నాం. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని రాజేందర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి నియోజకవర్గ పరిధి నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని కోరారు.