మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్దమవుతున్న విజయ్ దేవరకొండ

SMTV Desk 2019-03-05 17:12:25  Vijay Devarakonda,

యువ సంచలనం విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఆ మూవీ తర్వాత విజయ్ ఓ త్రిభాషా చిత్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందట. కోలీవుడ్ డైరక్టర్ ఆనంద్ అన్నామలై ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం విజయ్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నై రేసింగ్ ట్రాక్స్ మీద విజయ్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాడని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ లోనే రేసింగ్ సీన్స్ ఉంటాయట ఢిల్లిలో ఆ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి విజయ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది.