ఆకాశంలో 'బ్రహ్మాస్త్ర' లోగో ఆవిష్కరణ

SMTV Desk 2019-03-05 15:27:49  Brahmastra, Alia Bhatt, Amithab Bacchan, Ranbir kapoor, Brahmastra logo, Kumbhmela

ముంబై, మార్చి 05: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ ప్రాధాన్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర . ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లోగోను ప్రయాగ వద్ద జరుగుతున్న కుంభమేళాలో వినూత్నంగా ఆవిష్కరించారు. డ్రోన్ల సహాయంతో ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగోను రివీల్‌ చేయడం అందర్నీ ఆశ్యర్యపరిచింది. కుంభ మేళాలో పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం.. లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, అయాన్‌ ముఖర్జీ పాల్గొన్నారు. ధర్మ మూవీస్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.