ఏపీ ప్రజలకు బాబే సమాధానం చెప్పాలి: కేటీఆర్

SMTV Desk 2019-03-05 13:07:37  KTR, Chandrababu, Welfare Schemes, Data Leak, Police, Court, Petition

హైదరాబాద్, మార్చి 5: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డేటా లీక్ పై తెలంగాణ ప్రభుత్వం ను విమర్శించారు. ఇందుకు స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కీములతో ప్రయోజనం పొందుతున్న వారి డేటాను పక్కదారి పట్టించిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ కేసుకు సంబంధించి కోర్టుల్లో అబద్ధపు పిటిషన్లు వేసి, తెలంగాణ పోలీసుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటం చూస్తే కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు ఓ ప్రైవేట్ సంస్థకు లీక్ చేసినట్లు స్పష్టం అవుతోందని కేటీఆర్ ట్విట్టర్‌లో ఆరోపించారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.