ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స అంటేనే ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారు.

SMTV Desk 2019-03-05 13:06:15  NRI, Central Government, Menka Gandhi, Passport

న్యూడిల్లీ, మార్చి 05: ఈ మధ్య కాలంలో చాలామంది ప్రవాస భారతీయులు తమ భార్యలను వదిలేసి విదేశాలకు చెక్కేస్తున్నారు. అలా భార్యలను వదిలేస్తున్న భర్తలకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ. ఇప్పటివరకూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులను రద్దుచేసినట్లు ఆమె వెల్లడించారు. మహిళలకు న్యాయం చేసేందుకు తాము తీసుకొచ్చిన బిల్లు రాజ్యసభలో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. 1967 నాటి పాస్‌పోర్ట్‌ చట్టం, 1973 నాటి క్రిమినల్‌ ప్రొసిజర్‌లో సవరణలు తీసుకొచ్చి ఈ బిల్లు రూపొందిచినట్టు తెలిపారు. విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ బిల్లును తయారు చేశాయని వెల్లడించారు.