'తాత్కాలిక అభివృద్ధి-శాశ్వత అవినీతి'

SMTV Desk 2019-03-05 13:03:17  Kanna Lakshmi Narayana, Temporary Development, AP, Twitter

అమరావతి, మార్చి 5: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అంటే తాత్కాలిక అభివృద్ధి-శాశ్వత అవినీతి అంటూ దుయ్యబట్టారు. ఏపీలో అసెంబ్లీ, ప్రభుత్వం, రాజధాని, శిలాఫలకాలు ఇలా అన్ని తాత్కాలికమేనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కన్నా ట్విట్టర్ లో టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో స్పందిస్తూ, "ఏపీ లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం..తాత్కాలిక రాజధాని.. తాత్కాలిక సెక్రటేరియట్.. తాత్కాలిక అసెంబ్లీ.. తాత్కాలిక శంకుస్థాపనలు.. తాత్కాలిక శిలాఫలకాలు.. రాష్ట్రం రాబోయే దశాబ్దంలో కూడా కోలుకోలేనంత శాశ్వత అవినీతి" అని ట్వీట్ చేశారు.