బీజేపీలో చేరిన బీజేడీ నేత!

SMTV Desk 2019-03-05 13:00:38  BJP, BJD, Baijayanth Panda, Amit Shah, Naveen Patnayak

భువనేశ్వర్, మార్చి 5: ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఒడిశా అధికార పార్టీ బిజూ జనతా దళ్‌(బీజేడీ) కి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎంపీ బైజయంత్‌ పాండా సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసిన తరువాత ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పాండా బీజేడీలో చేరడం ఆ పార్టీ కి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.

బైజయంత్‌ పాండా నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒడిశాకు, దేశానికి చిత్తశుద్ధితో సేవ చేస్తానని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో వచ్చిన విభేదాల వల్ల గతేడాది బీజేడీకి రాజీనామా చేశారు. తన పట్ల పార్టీ అమానవీయంగా ప్రవర్తించిందని నవీన్‌ పట్నాయక్‌కు రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బీజేడీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలిపారు.