అమర జవాన్ల తల్లుల పాదాలు తాకిన నిర్మలా సీతారామన్

SMTV Desk 2019-03-05 12:51:41  Nirmala Seetharaman, Soldier Mothers, Respect, Shourya Samman Samaroh

న్యూఢిల్లీ, మార్చి 5: రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లో సోమవారం జరిగిన శౌర్య సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అమర జవాన్ల తల్లులను, సతీమణులను ఆమె ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించారు. అనంతరం జవాన్ల తల్లులకు పాదాభివందనం చేసి వారిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అయితే పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందకు వంగుతుండడంతో అవాక్కైన కొందరు తల్లులు వారించినా నిర్మలా సీతారామన్‌ పట్టించుకోలేదు. మంత్రి అమర జవాన్ల తల్లులకు ఇస్తున్న గౌరవాన్ని చుసిన అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు కరతాళ ధ్వనులతో అభినందించారు.