హర్యానా బీజేపీ అధ్యక్షుడి కుమారుడు అరెస్ట్

SMTV Desk 2017-08-05 18:22:27  President son arrested in haryana

ఛండీగఢ్, ఆగస్ట్ 5 : అధికారం అండగా ఉందన్న ధైర్యంతో కొందరు బడా బాబులు ఏం చేసిన చెల్లుతుందని రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి కుమార్తెను వెంటాడి వేధించినందుకు ఓ అధ్యక్షుడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. వివరాలలోకి వెళితే.. ఇద్దరు యువకులు తనను బైక్‌పై వెంబడించారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాను, మరో యువకుడిని ఛండీగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించగా వారు చిత్తుగా తాగినట్లు నిర్దారించుకున్న పోలీసులు వీరిపై వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.