మహేష్ ని కాదని ఇప్పుడు బన్నీతో...

SMTV Desk 2019-03-05 12:44:25  Maheshbabu, Allu Arjun, Sukumar, Arya

హైదరాబాద్, మార్చి 05: గత కొన్ని రోజులుగా సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్ మహేష్ కోసం కథ సిద్ధం చేయడంలో విఫలమయ్యాడు. దీంతో కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు రావడంతో సుకుమార్ తో సినిమా చేయడం లేదంటూ మహేష్ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ తో ఆర్య సినిమాకి మరో సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు.

నిన్న మహా శివరాత్రి సందర్భంగా ఆర్య సిరీస్ లో మూడో చిత్రం రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, సుకుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు మహేశ్ బాబు. కొత్త ప్రాజక్ట్ ప్రకటించిన సుకుమార్ కు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఓ అద్భుతమైన ఫిలింమేకర్ గా సుకుమార్ ను ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపాడు. 1నేనొక్కడినే మూవీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతుందని, ఆ సినిమాకు పనిచేసిన సమయంలో ప్రతిక్షణం ఎంజాయ్ చేసినట్టు మహేశ్ బాబు పేర్కొన్నారు.