బిగ్‌ బాస్ పార్టిసిపెంట్ ఆత్మ‌హ‌త్యా య‌త్నం

SMTV Desk 2017-08-05 18:10:34  Tamil Bigboss, Suicide attempt at Tamil bigboss show, Kamal hasan Bigboss show

చెన్నై, ఆగష్ట్ 5: తమిళ బిగ్‌ బాస్ కార్యక్రమంలో ఓ పార్టిసిపెంట్ ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసింది. ఈ షోకు కమలహాసన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ షోలో వివాదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ పార్టిసిపెంట్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. పార్టిసిపెంట్‌ ఓవియా హెలెన్‌ హౌస్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకి ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసింది. కాగా మిగతా పార్టిసిపెంట్స్‌పై ప్రభావం చూపిస్తుందని ఆమెను షో నుంచి బయటికి పంపేశారు. మానసికంగా సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌వుతున్న ఓవియా, ఎలాగైనా బిగ్‌ బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బిగ్‌ బాస్ హౌస్‌‌కి వర్క్ చేసే ఇబ్రహీం షేక్ అనే వ్యక్తి సెట్‌లోనే మ‌ర‌ణించ‌డంతో ఈ షో మరోసారి గందరగోళంగా మారింది.