ఎట్టకేలకు రవితేజ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది

SMTV Desk 2019-03-05 12:05:47  raviteja, raja the great, disco raja

హైదరాబాద్, మార్చి 04: ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాలు సక్సెస్ కి చాలా దూరంలో నిలిచిపోయాయి. దాంతో ఆయన అభిమానులు నిరాశతో వున్నారు. కాగా రవితేజ ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వీఐ ఆనంద్ తో కలిసి డిస్కో రాజా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించనున్నాడు.

అయితే పారితోషికం తగ్గించుకోమంటూ నిర్మాత .. కుదరదంటూ రవితేజ మధ్య విషయం నలుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే కథలో కొన్ని మార్పులు చేయమంటూ రవితేజ .. అవసరం లేదంటూ దర్శకుడి మధ్య వాదన జరుగుతోందనే టాక్ వచ్చింది. ఈ కారణంగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమవుతోందని చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు వీఐ ఆనంద్ కి వేరే ఆఫర్ వచ్చిందట. దాంతో ఆయన అటు వెళితే ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందని భావించిన నిర్మాతలు .. రవితేజ రంగంలోకి దిగిపోయారు. కొంతసేపటి క్రితమే ఈ సినిమాను లాంచ్ చేశారు. పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటించనున్న ఈ సినిమా, రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.