తెలంగాణాలో కాంగ్రెస్ ఖేల్ ఖతం

SMTV Desk 2019-03-05 11:30:50  Congress, Telangana,

తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోల్పోయింది, తాజాగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్లు స్పష్టం చేసారు, దీంతో కాంగ్రెస్ కు ఉన్న 19 ఎమ్మెల్యేల సంఖ్య 17కు తగ్గింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారట, దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా 12కు చేరుతుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే 10శాతం మంది ఎమ్మెల్యేలు ఉండాలి అంటే కనీసం 12మంది ఎమ్మెల్యేలు ఉండాలి.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు, ఖమ్మం నుండి మంత్రిగా ఎవరూ లేకపోవటం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలు ఆయనే చూసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు, కేసీఆర్ వారితో టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇక త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించటం కోసమే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టీఆరెఎస్ కు చెందిన 10మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని తెలంగాణ వాదాన్ని అణిచి వేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను వాడుకొని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు చెక్ చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారట.