27 ఏళ్లలో 52 బదిలీల...!

SMTV Desk 2019-03-04 19:51:24  Ashok Khemka, Sonia Gandhi, Robert Vadra, Haryana Sports Principal Secretary, 52 Transfers

న్యూఢిల్లీ, మార్చి 4: నిజాయితిగా ఉన్న అధికారులు అనేక పర్యవసానాలు చవిచూస్తారు. అలాంటి పరిణామమే మన ముందుకొచ్చింది. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అశోక్ ఖేమ్కా తాజాగా 52వ పర్యాయం బదిలీ అయ్యారు. తన వయసు 53 సంవత్సరాలు. ఖేమ్కా తన 27 ఏళ్ల సర్వీసులో 52 సార్లు బదిలిలయ్యారు. ప్రస్తుతం హర్యానాలో క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఖేమ్కాను ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది.

2012లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వ్యవహారాలకు సంబంధించి ఖేమ్కా తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య ఒప్పందాన్ని ఆయన రద్దు చేయడంతో ఖేమ్కా ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తరువాత అనేక ముఖ్య పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇటీవల హర్యానా క్రీడల విభాగంలో పదవి చేపట్టారు. కాగా ఖేమ్కా ఈ పదవి 15 నెలలు మాత్రమే పనిచేసినా తనదైన ముద్ర వేశారు. అందుకు ప్రతిఫలమే ఈ బదిలీ.