ఆంధ్రప్రదేశ్ లో కొత్త జాతీయ రహదారులు

SMTV Desk 2017-08-05 16:23:58  New Highway Roads in AP, Highway road from Rajahmundry to vijayanagaram, Highway road from Malkangiri to sabbavaram

అమరావతి, ఆగష్ట్ 5: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు రోడ్డు మార్గాలను జాతీయ రహదారులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం, చోడవరం మీదుగా మల్కన్‌గిరి నుండి సబ్బవరం వరకు ఒక హైవే ప్రతిపాదించబడింది. దీనిలో భాగంగా సబ్బవరం నుంచి తునికి వయా నర్సీపట్నం మీదుగా ఫోర్-వే రోడ్, నర్సీపట్నం-చింతపల్లి-మల్కన్‌గిరి మార్గంలో టూ-వే రోడ్డుగా ఉంటుందని అన్నారు. రూ .1,900 కోట్ల వ్యయంతో మొత్తం 282 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మిస్తున్నా మన్నారు. అటవీ భూములను కలిగి ఉన్న చోట కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటాం, ఇంకా 660 హెక్టార్ల భూమిని కొనుగోలు చేయాలన్నారు. ఈ రహదారిలో నర్సీపట్నం దగ్గర ఒక రింగ్ రోడ్ వస్తుందన్నారు. మరొక రహదారి రాజమహేంద్రవరం నుండి విజయనగరం వరకు, రంపచోడవరం, కె.డి. పేటా, లంబసింగి, పాడేరు, అరకు మీదుగా వెళుతుంది. రూ .3,000 కోట్లు ఖర్చుతో 440 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మితమౌతుందని ప్రకటించారు. ఈ రహదారి ఏజెన్సీ ప్రాంతాన్ని కలుపుతూ వెళుతుంది తద్వారా అభివృద్ధి పుంజుకుంటుందన్నారు.