పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు నగ్మా ఇచ్చిన సమాధానం

SMTV Desk 2019-03-04 19:08:44  nagma, tollywood actress, congress leader

హైదరాబాద్, మార్చి 04: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తేడా లేకుండా చిత్రసీమ ని ఒక దశాబ్దం పాటు ఏలింది నగ్మా. దాదాపు అగ్ర నటులందరితో నటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను పోషిస్తోంది. 45 ఏళ్ల వయసు వచ్చినా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.

తాజాగా మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అనే ప్రశ్న నగ్మాకు మీడియా నుంచి ఎదురైంది. దీనికి సమాధానంగా, పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎవరికైనా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెడతాడు. దాన్ని నేను డిసైడ్ చేయలేను అని చెప్పింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని కూడా తెలిపింది.