యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న ప్రభాస్ ఫాన్స్

SMTV Desk 2019-03-04 18:58:25  Prabhas, shades of saaho

డార్లింగ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు.టాలీవుడ్ తో పాటు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “సాహో” కూడా ఒకటి.సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ రోజు శ్రద్ధా పుట్టిన రోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2” మేకింగ్ వీడియోని విడుదల చేసారు.



అంతే మళ్ళీ ఈ వీడియోని కూడా యూట్యూబ్ లోని నెంబర్ 1 ట్రెండింగ్ లో ప్రభాస్ అభిమానులు పెట్టేసారు.ఈ రోజు ఉదయమే విడుదలైన ఈ వీడియో ఇప్పటికి 1.8 మిలియన్ వ్యూస్ మరియు 98 వేల లైక్స్ ని సంపాదించింది.అలాగే యూవీ క్రియేషన్స్ వారు పెట్టిన ఛానెల్లో కూడా 1.7 మిలియన్ వ్యూస్ మరియు లక్ష లైక్స్ కూడా దాటేసింది.దీనితో “షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1″తో చేసిన రచ్చ ఈ సారి చాప్టర్ 2 తో కూడా చేస్తున్నారనే చెప్పాలి.