ఈ నెల 7న టీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సభ

SMTV Desk 2019-03-04 17:22:21  warangal, trs, ktr, minister errabelli dayakar rao

వరంగల్, మార్చ్ 3: ఈ నెల 7న టీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ భారీ సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ కీలక నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి అన్నారు. ఈ రోజు నర్సంపేట రోడ్‌ ‘ఓ’ సిటీలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు బండా ప్రకాశ్‌, దయాకర్‌, ఎమ్మెల్యేలు నరేందర్‌, ఆరూరి రమేష్‌, వినయ్‌ భాస్కర్‌, ధర్మారెడ్డిలతో కలిసి సభాస్థలి మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కేటీఆర్‌ వరంగల్‌కు వస్తున్నందున ఘన స్వాగతం పలికేందుకు కదలిరావాలని కోరారు.