డేటావార్ వివాదంపై చంద్రబాబు చర్చ

SMTV Desk 2019-03-04 17:19:30  datawar, it grid company, bhaskar, andhrapradesh police, telangana police, chandrababu

అమరావతి, మార్చ్ 3: ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డేటావార్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం నాడు అమరావతిలో ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో చంద్రబాబునాయుడు సుమారు గంటకు పైగా చర్చించారు. డేటా చోరీ అంశంపై హైద్రాబాద్ కేంద్రంగా సాగుతున్న పోలీసుల దర్యాప్తు, ఏపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనే విషయమై చంద్రబాబునాయుడు ఏజీతో చర్చించారు. ఇప్పటికే వైసీపీ నేత విజయసాయిరెడ్డి, లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.