ఎఫ్-2 హాఫ్ సెంచరీ.

SMTV Desk 2019-03-02 18:04:24  f2 , fun and Frustration,

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో 106 సెంటర్స్ లో ఎఫ్-2 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ లకు జోడీగా తమన్నా, మెహ్రీన్ కౌర్ నటించారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన అనీల్ రావిపుడి ఎఫ్-2తో డబుల్ హ్యాట్రిక్ కు షురూ చేశాడు. ఇక ఈ సినిమా కలక్షన్స్ విషయానికొస్తే 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఈమధ్య నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఫెయిల్ అవుతున్న దిల్ రాజు ఈ సినిమాతో మంచి లాభాలు తెచ్చుకున్నాడు.