జరిమానాకు లైక్ ... ఫేస్ బుక్ ట్రబుల్

SMTV Desk 2017-06-01 15:59:09  facebook, fine, switzerland, jeniva

జెనీవా, జూన్ 1: రోజు రోజుకు విస్తృతం అవుతున్న సోషల్ మీడియా కార్యకలాపాలకు అనుగుణంగానే, ఆంక్షలు, చిక్కులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల పాలకుల నుండి ప్రతికూలత ఎదుర్కోంటే, మరి కొన్ని చోట్ల పరువు నష్టం వంటి దావాలకు బలవ్వాల్సి వస్తున్నది.. ఇటువంటిదే ఓ ఘటన జెనీవాలో చోటు చేసుకుంది. ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ కు లైక్ కొట్టి చిక్కులు తెచ్చుకున్నాడో వ్యక్తి. స్విట్జర్లాండ్ దేశంలో వివాదాస్పద వ్యాఖ్యను లైక్ చేసినందుకు ఆ వ్యక్తికి స్థానిక న్యాయ స్థానం 4 వేల డాలర్లు (దాదాపు రూ.2.60 లక్షలు) జరిమానా గా విధించింది. ఎర్విన్ కెస్లర్ అనే హక్కుల కార్యకర్తను నిందించేలా ఉన్న పోస్ట్ కు లైక్ కొట్టడంతో, ఆ వ్యక్తి ఈ ఫేస్ బుక్ ట్రబుల్ ను ఎదుర్కొన్నాడు. లైక్ కొట్టి ఆ వివాదాస్పద పోస్ట్ కు ప్రచారం కల్పించినట్లయిందని న్యాయస్థానం పేర్కోని జరిమానాను విధించింది.