అభినందన్ ను కలిసిన నిర్మలా సీతారామన్

SMTV Desk 2019-03-02 17:19:14  Abhinandan, Nirmala Seetharaman

న్యూ ఢిల్లీ, మార్చ్ 02: పాకిస్తాన్ నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆస్పత్రిలో కలుసుకున్నారు. ఐ ఏ ఎఫ్ డ్రస్ ధరించి ఉన్న అభినందన్ చాలా ప్రశాంతంగా మంత్రితో మాట్లాడారు.దేశం కోసం అంకితభావంతో పోరాడిన అభిని అభినందించారు. వివిధ రకాల పరీక్షల కోసం వింగ్ కమాండర్ ను ఆస్పత్రిలో ఉంచిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం వర్ధమాన్ తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.