కేసీఆర్ తో సమావేశమైన సండ్ర ..

SMTV Desk 2019-03-02 16:35:29  CM KCR, Sandra venakata veeraiah, MLA

హైదరాబాద్‌, మార్చ్ 2: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ రోజు ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు నాగార్జునసాగర్ ఎడమకాల్వ నుంచి నీరు విడుదల చేయాలని సిఎం కేసీఆర్ ను కోరారు. సండ్ర విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాల్లోని మెట్ట, ఆరుతడి పంటలకు నీరందించాలని సండ్ర కోరారు.