ఈ రోజు అభినందన్ ను అడిగిన ప్రశ్నలు ఇవే!!

SMTV Desk 2019-03-02 16:09:37  Abhinandan, Enquiry, Questions, Air Force, Department Mental Enquiry, IB, NIA

న్యూఢిల్లీ, మార్చి 2: భారత పైలట్ అభినందన్ విమానం కుప్పకూలి పాకిస్తాన్ కి చిక్కగా, నిన్న అతన్ని పాక్ ప్రభుత్వం భారత్ కు చేర్చింది. కాగా, దేశం ప్రజలందరూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాక్ ఆర్మీ చెర నుంచి ఆయన సురక్షితంగా నిన్న రాత్రి భారత గడ్డపై అడుగుపెట్టడంతో యావత్ భారతావని పులకించిపోయింది.

అతనిని ఈ రోజు డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీతో పాటు ఐబీ, ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ఈ విచారణలో అభినందన్ అసలు ఏం జరిగిందో మొత్తం వివరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణలో ఆయనను ఈ ప్రశ్నలు అడగనున్నట్లు సమాచారం.

శత్రువులకు దొరికిన తర్వాత స్వదేశానికి చేరేంత వరకు ఏం జరిగింది?

శారీరక సామర్థ్యంలపై పూర్తి వైద్య పరీక్షలు. దేశ రహస్యాలను తెలుసుకునే క్రమంలో ఏమైనా హింసకు గురి చేశారా అనేది ఈ వైద్య పరీక్షల్లో తేలిపోతుంది.

శరీరంలో ఏమైనా చిప్స్ ను చొప్పించారా? అనే కోణంలో పూర్తి స్థాయిలో స్కానింగ్.

శరీరంలోకి ఏవైనా ఔషధాలు ప్రయోగించి, జాతీయ భద్రతాంశాలు తెలుసుకున్నారా?

దేశ రహస్యాలను పాకిస్థాన్ కు అభినందన్ వెల్లడించారా?

నిజానికి తమ పైలట్ ను ఐబీ విచారించేందుకు వైమానికదళం అనుమతించదు. కానీ, ఇది అత్యంత కీలకమైన సంఘటన కాబట్టి విచారణకు ఎయిర్ ఫోర్స్ అంగీకరించింది. మరోవైపు శారీరక, మానసిక అంశాల్లో ఏమాత్రం తేడా ఉన్నా, అభినందన్ తన బాధ్యతలను వదులుకోవాల్సి ఉంటుందని సమాచారం. శరీరంలో లోతైన గాయాలు ఉంటే పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ విధుల్లో చేరాల్సి ఉంటుంది.