అబ్బాయి బ్యానర్లో బాబాయ్ సినిమా...?

SMTV Desk 2019-03-02 15:07:39  balakrishna, Kalyan Ram, NTR, NTR arts

హైదరాబాద్, మార్చి 02: కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త నిజమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటికే కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమా చేసాడు. ఇప్పుడు బాబాయ్ బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. గతంలో హరికృష్ణ కుటుంబానికి, బాలకృష్ణకు మధ్య సరైన రిలేషన్ ఉండేది కాదు కానీ, హరికృష్ణ మరణం తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు బలపడుతున్నట్లు అనిపిస్తోంది.

బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించటం, కళ్యాణ్ రామ్ 118 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ అతిధిగా రావడం వంటి పరిణామాలు చూస్తుంటే వీరి మధ్య సంబంధాలు మెరుగు పడుతున్నాయని తెలుస్తుంది. ఎన్టీఆర్, బాలకృష్ణకు దూరంగా ఉంటున్నప్పటికీ కళ్యాణ్ రామ్ మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే కళ్యాణ్ రామ్ బాలకృష్ణ సినిమాని నిర్మిస్తాడని తెలుస్తోంది.