ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎన్నికల వ్యూహం

SMTV Desk 2019-03-02 15:06:25  TRS, Telangana, KTR, KCR, Elections

హైదరాబాద్, మార్చి 02: జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో 17కు 17 స్థానాలు క్లీన్ స్వీప్ చేయాల‌ని చూస్తున్నారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయాడ‌మే ల‌క్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. ఈ ఎన్నికల బాధ్యతల్ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించాడు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా పార్లమెంట‌రీ స్థాయి కార్య‌క‌ర్త‌ల స‌మా వేశాల‌ను ద‌శ‌ల వారీగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ నెల 6 నుంచి 17 వ‌ర‌కు ఈ స‌మావేశాల్ని నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు.

అయితే ఈ సమావేశాలు మార్చి 1నుండే ప్రారంభం కావాల్సి ఉండగా భార‌త్ – పాక్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌లు, వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ విడుద‌ల వంటి కార‌ణాల వ‌ల్ల ఈ సామ‌వేశాల‌ను 6వ తేదీకి వాయిదా వేశారు. కేసిఆర్ సూచన మేరకు మార్చి 6 నుంచి 17 వ‌ర‌కు నిర్వ‌హించే స‌మావేశాల షెడ్యూల్ ను పార్టీ నేతలు విడుదల చేసారు. హైద‌రాబాద్ మిన‌హా రాష్ట్రంలోని 16 లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాల్లో స‌మావేశాలు నిర్వ‌హించి ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన ప్యూహాల‌పై కార్య‌క‌ర్త‌ల‌కు తెరాస దిశ నిర్దేశం చేయ‌నున్నారు. ప్ర‌తి లోక్‌స‌భకు సంబంధించిన నియోజ‌క‌వ‌ర్గంలో 3 నుంచి 5 ల‌క్ష్ల మెజారిటీ సాధించే విధంగా ప‌క్కా ప్ర‌ణాళిను రూపొందించారు.ఈ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, కార్య‌క‌ర్త‌ల స‌మీక‌ర‌ణ వంటి బాధ్య‌త‌ల్ని నియోజ‌క వ‌ర్గాల‌కు చెందిన మంత్రుల‌కు అప్ప‌గించారు. ప్ర‌తి నియోజ‌క వ‌ర్గం నుంచి రైతు స‌మ‌న్వ‌య స‌మితి, స‌ర్పంచ్‌. .ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఇలా 15 మంది కీల‌కంగా మారే కార్య‌క‌ర్త‌లు పాల్గొన‌బోతున్నారు.