ఆయన ఓ సంప్రదాయమైన నటుడు: శృతి హాసన్

SMTV Desk 2019-03-02 11:41:41  Shruti haasan, Kamal Haasan,Ajith

చెన్నై, మార్చి 02: హీరోయిన్ శృతి హాసన్ చాలాకాలంగా తెరపై కనిపించలేదు. ఈమె నటించింది తక్కువ చిత్రాలే అయినా, విజయాల శాతం ఎక్కువే. అభిమానులూ అధికమే. ఇటీవల నటనకు కాస్త దూరం అయినా అభిమానుల్లో మాత్రం శృతి హాసన్ ‌కు క్రేజ్ తగ్గలేదు. సినిమాలకు దూరమైనా తరచూ సామజిక మాధ్యమంలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇటీవల శృతి హాసన్ వేలూర్‌లోని కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శృతి హాసన్ చాలా సహనంగా బదులిచ్చింది.

అందులో మీకు నచ్చిన చిత్రం ఏమిటని అడిగితే తన తండ్రి నటించిన మహానది సినిమా అని చెప్పింది. ఉత్తమ నటుడు కమలహసన్‌ అని చెప్పింది. సినీరంగంలో మీరు కోరుకునేది? అన్న ప్రశ్నకు తాను నటిగా, గాయనిగా, సంగీతదర్శకురాలి పేరు తెచ్చుకున్నా, వీటన్నింటిలోనూ తాను కోరుకునేది ఎంటర్‌టెయిన్‌మెంట్‌నేనని చెప్పింది. మీరు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు.

అందులో ఏ చిత్ర పరిశ్రమ ఉన్నతంగా అనిపించింది? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు తాను ఏ భాషలో పని చేసినా నటననే ఇష్టపడి చేస్తానని చెప్పింది. నటుడు అజిత్‌ గురించి మీ అభిప్రాయం అన్న ప్రశ్నకు తనకు బాగా ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరని చెప్పింది. తాను కలిసిన నటుల్లో సంప్రదాయమైన నటుడు అజిత్‌ అని శ్రుతిహాసన్‌ చెప్పింది. ఆమె అజిత్‌తో కలిసి వేదాళం అనే చిత్రంలో నటించింది.