అభినందన్ పై బయోపిక్?

SMTV Desk 2019-03-02 11:39:05  Movie titles, Directors, Producers, Abhinadan, bollywood

ముంబై, మార్చి 02: దేశంలో జరిగే తాజా పరిణామాలను కాష్ చేసుకునే పనిలో పడ్డారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. కొత్త ట్రెండ్, హాట్‌ టాపిక్స్‌ను క్యాచ్‌ చేసి సినిమా టైటిల్స్‌గా ఫిక్స్‌ చేస్తుంటారు. తాజాగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం సంగతి తెలిసిందే. ఈ హీట్‌ను సినిమా టైటిల్స్‌ రూపంలో వాడుకోవాలనుకుంటున్నారు బాలీవుడ్‌ దర్శక–నిర్మాతలు.

ఆల్రెడీ పుల్వామా ఎటాక్, సర్జికల్‌ స్ట్రైయిక్‌ 2.0, అభినందన్, హిందుస్తాన్‌ హమారా హై అనే టైటిల్స్‌ను కూడా రిజిస్టర్‌ చేశారట. అంతే కాకుండా ప్రస్తుతం బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వెబ్‌సిరీస్‌ ఐడియాలు కూడా రెడీ చేస్తున్నారట. ఈ పరిణామాలు చూస్తుంటే ఇటీవలే పాకిస్తాన్ వెళ్లి తిరిగి వచ్చిన భారత్ వింగ్ కమాండర్ అభినందన్ బయోపిక్ ను తెరకెక్కించినా ఆశ్చర్యం లేదు.