అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నా

SMTV Desk 2019-03-02 11:08:21  Allu arjun, noorin Shareef, Lovers day, Priya Prakash

హైదరాబాద్, మార్చి 02: ప్రియా ప్రకాష్ నటించిన లవర్స్ డే చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ తో పాటు నూరిన్ షరీఫ్ మరో హీరోయిన్ గా నటించింది. సినిమాలో ప్రియా ప్రకాష్ కంటే నూరిన్ నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే ఈ అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నూరిన్ షరీఫ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అల్లు అర్జున్ గురించి నూరిన్ షరీఫ్ మాట్లాడుతూ.. అందరిలానే అల్లు అర్జున్ అంటే తనకూ బాగా ఇష్టమని, తను కూడా బన్నికి పెద్ద ఫ్యాన్ అని.. లవర్స్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ రావడంతో తనకు చాలా సంతోషంగా అనిపించిందని.. ఓ సందర్భంలో ఆయన్ను పెళ్లాడాలనిపించిందని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.