ధియేటర్లో సాహో మేకింగ్ వీడియో...?

SMTV Desk 2019-03-01 18:24:25  Saaho, Shades of Saaho chapter 2, Shraddha Kapoor, Sujith

హైదరాబాద్, మార్చి 01: ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా మేకింగ్ వీడియో పార్ట్ 2 ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 పేరుతో ఒక మేకింగ్ వీడియో ను విడుదల చేసారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా హీరోయిన్ శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 3న షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2 విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు విడుదల చేయనున్న ఈ వీడియోను కేవలం యుట్యూబ్ లో కాకుండా ధియేటర్లో కూడా విడుదల చెయ్యాలని చాలా మంది డార్లింగ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకి పెడుతున్న బడ్జెట్ కి తగ్గట్టే సుజీత్ ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.మరి అభిమానుల కోరిక మేరకు విడుదల కాబోతున్న కొత్త సినిమాలకి ఈ మేకింగ్ వీడియోను కూడా అటాచ్ చేస్తారో లేదో చూడాలి.