మళ్ళీ సంక్రాంతికే వస్తానంటున్న బాలకృష్ణ

SMTV Desk 2019-03-01 13:59:45  Balakrishna, Boyapaati Srinu, NTR Kathanayakudu, Mahanayakudu, Sankranthi season

హైదరాబాద్, మార్చి 01: హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల బాలకృష్ణ నటించిన రెండు చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు చిత్రాలు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడంలో విఫలమయి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను తెచ్చి పెట్టాయి. మరోవైపు బోయపాటి దర్శకత్వం వహించిన వినయ విదేయ రామ సినిమా కూడా బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు విజయం కోసం బాలకృష్ణ, బోయపాటి కలిసి పని చేయబోతున్నారు.

వరుసగా ఫ్లాప్ లు రావడంతో ఈ సారి హిట్ కొట్టాలనే ఉదేశ్యంతో బాలకృష్ణ ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు బోయపాటితో చేయబోయే సినిమాను వచ్చే సంక్రాంతి సీజన్ లోనే విడుదల చేయాలనీ బాలకృష్ణ పట్టుబట్టాడట. దాంతో సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తయారైన తర్వాతే సెట్స్ పైకి వెళ్దామని బోయపాటితో చెప్పారట. అంతేకాదు...పొలిటికల్ కథ అసలు వద్దని, దాని వలను తనకు ప్రస్తుతం కలిసొచ్చేదేమీ లేదని చెప్పారట. దాంతో బోయపాటి మరో ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను తయారు చేసే పనిలో పడ్డారట. కేవలం స్టోరీ లైన్ విని ఓకే చేసేది లేదని పూర్తి బౌండ్ స్క్రిప్టుతో రమ్మని బోయపాటికి బాలయ్య పురమాయించాడట.