'28°C'లో నవీన్ చంద్ర...!

SMTV Desk 2019-03-01 13:45:30  Naveen Chandra, Shalini, Hero Heroine, Anil Vishwanath, 28°C

హైదరాబాద్, మార్చి 01: నవీన్ చంద్ర అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు. కానీ అందాల రాక్షసి సినిమా తర్వాత అతని కెరీర్ లో హీరోగా మరో హిట్ కొట్టలేక పోయాడు. దీంతో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కుడా కొన్ని సినిమాల్లో నటించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి తోటి కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే తను కూడా హీరోగా డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇటీవలే నవీన్ చంద్ర నటించిన హీరో హీరోయిన్ అనే చిత్రం టీజర్ ను విడుదల చేసారు.

ఈ సినిమా విడుదల కాకముందే నవీన్ మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. 28°C అనే సినిమాతో కొత్త ప్రయోగమే చేయబోతున్నాడు. ఈ సినిమాకి అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహిస్తుండగా, షాలిని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే ట్రైలర్ అండ్ టీజర్స్ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఆపై రెగ్యులర్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.