టీడీపీలో చేరనున్న వైసీపీ నేత...

SMTV Desk 2019-02-28 21:37:37  YSRCP, Sunil, TDP, Chandrababu, Kakinada constituency, Thota narasimham

అమరావతి, ఫిబ్రవరి 28: కాకినాడ నుండి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన సునీల్ టీడీపీలో చేరనున్నారు. ఈయన కొద్ది రోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పారు. కాగా అదే సమయంలో ఆయన టీడీపీలో చేరుతారని భావించారు. చెలిమలశెట్టి సునీల్ మార్చి1వ తేదీన సునీల్ బాబు సమక్షంలో టీడీపీలో తన అనుచరులతో కలిసి చేరనున్నారు. 2009 ఎన్నికల్లో సునీల్ పీఆర్పీ అభ్యర్ధిగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు రోజుల క్రితమే సునీల్ టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిశారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని బాబుకు చెప్పారు. తనకు కానీ, తన భార్యకు కానీ జగ్గంపేట సీటు ఇవ్వాలని బాబును నరసింహం కోరారు. అయితే తోట నరసింహం పోటీ చేయనని తేల్చి చెప్పడంతో సునీల్ కాకినాడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీకి సై అంటున్నారు. ఇందులో భాగంగానే సునీల్ బాబును కలిశారు. వచ్చే ఎన్నికల్లో సునీల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.